జయ కుటుంబ సభ్యులకు చేదు అనుభవం: కొడలికి నో చాన్స్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితను చూడటానికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులకు చేదు అనుభవం ఎదురైయ్యింది. అమ్మను చూడాలని జయలలిత అన్న కుమార్తె దీప ఆసుపత్రి దగ్గరికి వెళ్లారు.

అయితే ఆసుపత్రి వర్గాలు, అన్నాడీఎంకే పార్టీ నాయకులు, జయలలిత ఆప్తులు అమ్మను చూడటానికి అవకాశం ఇవ్వలేదు. చాల సేపు ఆసుపత్రి గేటు దగ్గర వేచి చూసిన దీప చివరికి సాధ్యం కాకపోవడంతో వెనుతిరిగారు

 బెంగళూరులో ఉంటున్నారు

బెంగళూరులో ఉంటున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్న జయకుమార్ బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్నారు. జయ కుమార్ కుమార్తె దీప. జయలలిత ఆరోగ్యం విషయంలో రోజుకోక వివాధం రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు.

 ఎందుకు అనుమతి ఇవ్వలేదు

ఎందుకు అనుమతి ఇవ్వలేదు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ, అన్నాడీఎంకే పార్టీ నాయకులు, తమిళనాడు మంత్రులు రోజూ వెళ్లి చూస్తున్నారు. అమ్మ బాగున్నారని అందరికి చెబుతున్నారు. అయితే సొంత అన్న కుమార్తె దీపకు మాత్రం చూడటానికి అవకాశం ఇవ్వలేదు.

 కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జయ

కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జయ

జయలలిత మొదటి నుంచి ఆమె కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యుల శుభకార్యాలకు సైతం జయలలిత హాజరుకాలేదని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. ఇప్పుడు జయలలితను చూడటానికి అవకాశం ఇస్తే అమ్మకు కోపం వస్తుందని ఓ నాయకుడు చెప్పారు.

 కంటికి రెప్పలా చూసుకుంటున్న !

కంటికి రెప్పలా చూసుకుంటున్న !

జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ జయలలితను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. ప్రతి రోజు శశికళ ఆసుపత్రికి వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉండి వస్తున్నారు.

 కార్యకర్తలే నాకు అండ

కార్యకర్తలే నాకు అండ

అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అని జయలలిత అనేక సార్లు చెప్పారు. నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ నావారసులు కాలేరని పలు సందర్బాల్లో అన్నారు. అయితే ఇలాంటి సమయంలో జయలలితను చూడటానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో కొందరు అన్నాడీఎంకే నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 అమ్మను చూపించండి సార్

అమ్మను చూపించండి సార్

మా అత్తను చూపించండి సార్ అంటూ జయలలిత అన్న కుమార్తె దీప ఆసుపత్రి వర్గాలను వేడుకున్నా ఫలితం లేదు. జయలలిత క్షేమంగా ఉంటే చాలని వారు విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+