జయలలిత మేనకోడలు దీపా ధీమా: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం మాదే, శశికళకు కాదు!

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తనకే దక్కుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ను తాము సంప్రధించామని దీపా అన్నారు.

శుక్రవారం జయలలిత మేనకోడలు దీపా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. జయలలితకు వారసులు మేమేనని, అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాకే రావావలని దీపా అంటున్నారు. జయలలిత ఆశయాలు కాపాడే సత్తా మాకే ఉందని దీపా ధీమా వ్యక్తం చేశారు.

Deepa Jayakumar hopes she will get the AIADMK party symbol

శశికళ, టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు మమ్మల్ని మా మేనత్త జయలలితకు దూరం చేశారని దీపా ఆరోపించారు. చిన్నతనంలో మేము పోయెస్ గార్డెన్ లోనే ఉన్నామని, తరువాత శశికళ కుటుంబ సభ్యుల కారణంగా మేము జయలలితకు దూరం అయ్యామని దీపా ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి తాము ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను సంప్రధించామని, మరోసారి అధికారులను సంప్రధిస్తామని దీపా జయకుమార్ చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యడమే మా లక్షం అని దీపా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+