పన్నీర్‌కు మద్దతు ప్రకటించిన దీప.. కాసేపట్లో భేటీ అయ్యే ఛాన్స్
ఇప్పటికే ప్రజల్లో పన్నీర్ పట్ల సానుభూతి పెరగగా.. తాజాగా జయ మేనకోడలు దీప నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది.
చెన్నై: శశికళతో పోరులో పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పన్నీర్ సెల్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనూహ్య రీతిలో తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఆయన.. ఒంటరిగా అయినా సరే శశికళకు వ్యతిరేకంగా పోరాడుతానని సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రజల్లో పన్నీర్ పట్ల సానుభూతి పెరగగా.. తాజాగా జయ మేనకోడలు దీప నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అవసరమైతే దీప మద్దతు కూడా కోరుతానని ఆయన ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె స్పందించడం గమనార్హం.

పన్నీర్ కు మద్దతు ప్రకటించిన దీప జయకుమార్ మరికొద్దిసేపట్లో పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, తొలినుంచి పార్టీలో శశికళ ఆధిపత్యాన్ని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. శశికళకు వ్యతిరేకంగా ఇప్పుడు పన్నీర్, దీప ఇద్దరు ఒక్కటవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications