జయలలిత మేనకోడలు దీపా డెడ్ లైన్: నేడు ప్రకటన !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రాజకీయ అరంగేట్రంపై నేడు తుదినిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నాయకులతో దీపా .

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రాజకీయ అరంగేట్రంపై నేడు తుదినిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నాయకులతో దీపా అత్యవసర సమావేశం అయ్యారు.

జయ మేనకోడలు దీపా దెబ్బ: అమ్మ డీఎంకే పార్టీ ఆవిర్భావం

చెన్నైలోని టీ.నగర్ లోని ఇంటిలో దీపా జయకుమార్ సోమవారం అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. రాజకీయ రంగప్రవేశంపై తుదినిర్ణయం తీసుకోవాలని జయలలిత అభిమానులు దీపాకు మనవి చేశారు.

Deepa officialy to announce her own political party with the AIADMK cadres support.

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంతగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) శతజయంతి రోజున దీపా రాజకీయ అరంగ్రేట్రం చేస్తారని ఇప్పటికే దీపా పేరవై సంస్థ నాయకులు, ఆమె అభిమానులు చెప్పారు.

జయ మృతి: సీబీఐ నుంచి శశికళ తప్పించుకోలేరు ! ఎంపీ

అయితే సోమవారమే ఆమె తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఓ ప్రకటన చేసి ఎంజీఆర్ శతజయంతి రోజు (మంగళవారం) అధికారికంగా రాజకీయ పార్టీ పేరు ప్రకటించాలని ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

మొత్తం మీద జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. దీపా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని తెలుసుకున్న చెన్నైలోని ఆర్ కే నగర్ ప్రజలు ఇప్పటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+