దీపికా పదుకొనే 'నా ఇష్టం'కు లక్షల హిట్స్, కౌంటర్ వీడియోలు

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటీవల 'మై ఛాయిస్'లో చేసిన వ్యాఖ్యలు సామాజిక అనుసంధాన వేదికపై చర్చకు దారి తీశాయి. ఆమె పైన విమర్శలు, ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియోకు పెద్ద స్థాయిలో హిట్స్ వస్తున్నాయి.

వీడియో విడుదలైన రోజులోనే ఇరవై లక్షల హిట్స్ వచ్చాయి. రెండు రోజుల్లో ముప్పై లక్షల హిట్స్ వచ్చాయి. ఇది రెండు నిమిషాల వీడియో. దీని డైరెక్టర్ హోమీ అదజానియా. ఈ వీడియో సంచలనం రేపుతోందని, అయితే అందులో ప్రశ్నించిన విషయం కొత్త కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎంతోకాలంగా చాలామంది మహిళలు ఈ విషయమై నిలదీస్తున్నారంటున్నారు. అయితే, ఈ వీడియో మనసులను తాకుతుందని చెబుతున్నారు. అయితే, వీడియో చివరలో కొంత డిసప్పాయింట్ చేస్తుందని చెబుతున్నారు. 'మై చాయిస్' కోసం దీపికా పదుకొణెను ఎంపిక చేసుకోవడం సరైనదేనని అంటున్నారు. దీపికా పదుకొణే చాలా విషయాలపై ఓపెన్‌గా, ధైర్యంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

Deepika Padukone's 'My Choice' video: Twitteratti stands divided

కాగా, అంతర్జాతీయ ఫ్యాషన్‌ సంస్థ డివో తమ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన వీడియె సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దిపికా ప్రధాన పాత్రదారిణిగా మహిళా సాధికారిక కాన్సెప్ట్‌తో తీసిన మై ఛాయిస్‌ వీడియో యుటూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దానికి పారిడీగా మై ఛాయిస్‌ మేల్‌ వెర్షన్‌లు కూడా వచ్చాయి.

మై ఛాయిస్‌ వీడియోకు ఎన్నో పేరడీలు కూడా వచ్చాయి. మై ఛాయిస్‌ మేల్‌ వెర్షన్‌ పేరుతో సీరియస్‌ విమర్శల నుంచి వ్యంగ్య వ్యాఖ్యల వరకు పలు వీడియోలు యుటూబ్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. సాధికారిత మహిళలకే కాదు మగాళ్లకు అవసరమంటూ చురకలు వేస్తున్నారు.

ప్రఖ్యాత ఫ్యాషన్‌ మాగజైన్‌ డివో మార్చి 28న మై ఛాయిస్‌ పేరిట యుటూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్‌ చేశారు.దీపిక ప్రధాన పాత్రదారిణిగా ఆ వీడియో రూపొందించారు. మహిళా సాధికారికతను ప్రచారం చేయడమే దాని లక్ష్యం. దీపికా నేపథ్య గళంతో నడిచే ఆ వీడియోలో ఏ విషయంలోనైనా మహిళలకు ఎంచుకునే హక్కు ఉండాలని ప్రకటించారు.

శరీరాకృతి, వస్త్రధారణ, వైవాహిక సంబంధాలు, లైంగిక జీవితం, పిల్లలను కనడం వంటి అంశాల్లో తుది ఎంపిక మహిళలదే ఉండాలని ఈ వీడియో సందేశమిస్తోంది. ‘మా శరీరం, మా మైండ్, మా ఇష్టం' అంటూ..... మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాము అంటూ సాగిన వీడియోలో వివిధ రంగాలకు చెందిన 99 మంది మహిళా ప్రముఖులు పాలు పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+