దీపిక సినిమాకు కాంగ్రెస్ సీఎంల ప్రచారం.. పన్నురాయితీ.. ఫ్యామిలీతో కలిసి ‘చపాక్’ చూడాలని వినతి..
Recommended Video
యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితగాథ ఆధారంగా, స్టార్ హీరోయిన దీపిక పదుకొనె ముఖ్యపాత్రలో నటించిన 'చపాక్'సినిమాకు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు పన్ను రాయితీ ప్రకటించాయి. మూడ్రోజుల కిందట దీపిక.. జేఎన్‌యూకు వెళ్లి లెఫ్ట్ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన తర్వాత ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ కోసమే దీపిక ఈ పనిచేశారనే విమర్శలు వస్తున్న తరుణంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించడం గమనార్హం.

చూసి అందరికీ చెప్పండి..
శుక్రవారం విడుదల కానున్న చపాక్ సినిమాకు పన్ను రాయితీ కల్పిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘సమాజంలో మహిళలపై యాసిడ్ దాడి వంటి ఘోరమైన అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచే సినిమా ఇది. కాబట్టి ఫ్యామిలీలతో కలిసి సినిమాకు వెళ్లండి. మీ అవగాహనను అందరికీ చెప్పండి''అని రాష్ట్రప్రజలను ఉద్దేశిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

పాజిటివ్ మూవీ
పన్ను రాయితీ ప్రకటన సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ట్విటర్ లో కామెంటల్ పెట్టారు. ‘‘యాసిడ్ దాడికి గురైనప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దనే పాజిటివ్ మెసేజ్ ఇస్తున్న సినిమా చపాక్. అందుకే ట్యాక్స్ రద్దు చేశాం''అని తెలిపారు. శుక్రవారం చపాక్ సినిమా విడుదలయ్యే సమయానికి మరికొన్ని రాష్ట్రాలు కూడా పన్ను మినహాయింపు ప్రకటించే అవకాశాలున్నాయి.

నిర్మాత కూడా దీపికే
తల్వార్, రాజీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న మేఘనా గుల్జార్(కవి గుల్జార్ కూతురు) దర్శకత్వంలో రూపొందిన చపాక్ సినిమాలో దీపిక పదుకొనె ప్రధాన పాత్ర పోషిండంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించారు. సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. కాగా, చిత్రంలో చపాక్ సినిమాలో లక్ష్మీ అగర్వాల్‌కు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె తరఫు లాయర్ అపర్ణ భట్ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications