ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్-కీలక సూచనలు..!
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోకి చొరబడి వారి రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రవాదుల శిబిరాల్ని కూడా మట్టుబెట్టిన భారత్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్ లో చొరబాటుకు, దాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో భారత్ లో పలు టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫారాలు దేశం మీద జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్ లో చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిపై కేంద్రం సీరియస్ అయింది.
మన దేశంపై జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్ లో చూపించడం ద్వారా ప్రత్యర్ధి దేశాలకు మేలు జరుగుతోందని ఆందోళనగా ఉన్న రక్షణశాఖ ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు చేసింది. ఇందులో అన్ని మీడియా ఛానెల్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వ్యక్తులు రక్షణ కార్యకలాపాలు మరియు భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం లేదా లైవ్ రిపోర్టింగ్ నివేదికలుగా అందించకుండా ఉండాలని సూచించింది.

అటువంటి సున్నితమైన లేదా మూలాధార సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపింది. అలాగే ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని తెలిపింది. కార్గిల్‌వార్, 26/11 దాడులు మరియు కాందహార్ హైజాక్ వంటి గత సంఘటనలు అకాల నివేదికల ప్రమాదాలను నొక్కి చెబుతున్నాయని గుర్తుచేసింది.
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 9, 2025
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021లోని క్లాజు 6(1)(p) ప్రకారం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో నియమించబడిన అధికారుల ద్వారా కాలానుగుణ బ్రీఫింగ్‌లు మాత్రమే అనుమతించబడతాయని తెలిపింది. కాబట్టి దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ కవరేజ్‌లో అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతను పాటించాలని రక్షణశాఖ కోరింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications