పెళ్ళైన నెలలకే భర్త సూసైడ్: ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో

భోపాల్:ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భార్య తనను మోసం చేసిందనే బాధతో ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛటర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్‌ ఛటర్‌పూర్‌ జిల్లా గంజ్‌ గ్రామానికి చెందిన తులసీదాస్‌ పాటిల్‌ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడికల్‌ క్లినిక్‌ పెడతానంటే ఇంటిని అమ్మి 2లక్షల డబ్బు సహాయం చేశాడు. కారణాలేమిటో తెలియదు కానీ భర్తతో ఆమె విడిపోయింది. దీంతో తులసీదాస్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Dejected husband records statement on phone before killing self in MP

ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను తెలుపుతూ వీడియో సెల్ఫీ తీసి దాన్ని అతని బావకు పంపాడు. ప్రాణంగా ప్రేమించిన ఆమె నన్ను దూరంగా పెడుతోంది. ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేయడానికి సిద్దపడుతున్నారని తెలిసిందని ఆయన ఆ సెల్పీ వీడియోలో చెప్పారు.

ఆమె బంధువులతో గొడవపడేంత దమ్ము తనకు లేదన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. . ఇంట్లో భద్రపరిచిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, మ్యారేజ్‌ సర్టిఫికేట్లు పోలీసులు చూడాలని ఆయన ఆ సెల్ఫీ వీడియోలో తులసీదాస్‌ కోరాడు. ఆలస్యంగా వీడియో చూసిన తులసీదాస్‌ బావ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+