ఢిల్లీ బిజెపి సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ: షా డిక్లేర్, బేడీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపిఎస్ అధికారి, అవినీతి వ్యతిరేక ఉద్యమకారిణి కిరణ్‌బేడీని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం సాయంత్రం సమావేశమైన బిజెపి పార్లమెంటరీ బోర్డు కిరణ్ బేడీ సిఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అధికారికంగా కిరణ్ బేడీ అభ్యర్థిత్వాన్ని మీడియాకు వెల్లడించారు.
బేడీని పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికచేసినట్లు చెప్పారు. నగరంలోని కృష్ణానగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారని తెలిపారు. ఆమె నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా తోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, తనను సిఎం అభ్యర్థిగా ప్రకటించడంపై కిరణ్ బేడీ స్పందిస్తూ.. బిజెపి అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. తాను బిజెపిలో చేరటంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నదన్న వార్తలు కేవలం ఊహాజనితాలని కిరణ్ బేడీ కొట్టిపారేశారు. ‘అదంతా అతిశయోక్తి. నేనిప్పుడు పార్టీలోని వ్యక్తిని. పార్టీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో ఐకమత్యంతో మెలుగుతున్నారు' అని పేర్కొన్నారు.
బేడీ కేవలం సామాన్య కార్యకర్తేనన్న పార్టీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘నేను వెళ్లి ఆయనతో కలిసి చాయ్ తాగుతా. ఇదంతా ఐక్యతే. అహానికి ఇక్కడ తావులేదు. ఢిల్లీ నగరం అలజడులకు కేంద్రం కాకూడదన్న అత్యున్నత లక్ష్యంకోసం మేమిక్కడున్నాం. నా వరకు నాకు ఇండియానే ప్రధానం' అని ఆమె తెలిపారు.
ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా సేవలు కొనసాగిస్తూనే ఉంటానని ఆమె తెలిపారు. రోహినీ ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శల దాడి చేశారు. ‘ప్రభుత్వం జంతర్‌మంతర్‌కు (ధర్నాలు చేసేందుకు) వెళ్లినంతమాత్రాన ఏమీ జరుగదు. ఈసారి స్థిరమైన, పూర్తి మెజారిటీగల ప్రభుత్వం కోసం ఓటేయండి. ఆ ప్రభుత్వం ఘర్షణలకు దిగకుండా కొత్త రాజకీయాలు అవలంభిస్తుంది' అని పేర్కొన్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications