ప్రతి మహిళకు రూ. 2,100 పంపిణీ: ఫైల్‌పై సీఎం సంతకం: రేపటి నుంచి పేర్లు నమోదు
Arvind Kejriwal: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది. షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.
అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రయంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆటో డ్రైవర్ల కోసం అయిదు గ్యారంటీలను ప్రకటించారాయన. ప్రతి ఆటో డ్రైవర్‌కూ 10 లక్షల రూపాయల వరకు జీవిత బీమా, అయిదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా, కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఆటో డ్రైవర్ల యూనిఫాం కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి 2,500 రూపాయలు చెల్లింపు, కాంపిటీటివ్ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరం అయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించడం వంటివి ఇందులో ఉన్నాయి.
తాజాగా మహిళలకు వరాలను ప్రకటించారు కేజ్రీవాల్. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెలా 1,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించారాయన. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2,100 రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆతిషి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబందించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు.
दिल्ली सरकार की 'महिला सम्मान योजना' हुई शुरू 😍🔥
— AAP (@AamAadmiParty) December 12, 2024
🔷 अब दिल्ली की सभी माताओं-बहनों को प्रति महीने मिलेंगे 2100 रुपए #KejriwalMahilaSammanYojna pic.twitter.com/i6zgmfAKOm
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద చెల్లించదలిచిన 1,000ల మొత్తాన్ని పెంచాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమితంగా పెరిగిపోయిన నిత్యావస సరుకుల ధరల వల్ల పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
1,000 ఆర్థిక సాయం సరిపోదంటూ మహిళలు చెబుతున్నారని, వారితో తాను ఏకీభవిస్తోన్నానని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ఈ మొత్తాన్ని 2,100 రూపాయలకు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి మహిళలు శుక్రవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications