ఓటరు కార్డుతో రాహుల్: భర్తతో ప్రియాంక (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా బుధవారం కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మందిర్ మార్గ్ ప్రాంతంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మహాత్మా గాంధీని గుర్తు చేస్తూ తెల్లటి టోపీలు ధరించడం ఈ ఘర్షణకు కారణమైంది.

నేను ఆమ్ ఆద్మీని (నేను సామన్యుడిని) అనే పదాలు రాసిన తెల్లటి టోపీలను ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ధరిస్తుంటారు. అయితే, బుధవారం ఆ వాక్యం లోని తెల్లటి టోపీలను ఆమ్ ఆద్మీ మద్దతుదారులు ధరించారు. దాంతో కాంగ్రెసు కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. అదే ఎన్నికల ప్రచారం కిందికే వస్తుందని కాంగ్రెసు కార్యకర్తలు వాదించారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వినలేదు. దీంతో ఓ కాంగ్రెసు కార్యకర్త ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త టోపీని లాగి పారేశాడు.

పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. గాంధీ టోపీలను ధరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు అనుమతి లభించింది. కాగా, బుధవారంనాడు పలువురు అగ్రనేతలు ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీ ఎన్నికలు 1

ఢిల్లీ ఎన్నికలు 1

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నిర్మాణ్ భవన్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసి వెళ్లిపోతున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ..

ఢిల్లీ ఎన్నికలు 2

ఢిల్లీ ఎన్నికలు 2

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇంక్ మార్కు గల చేతి వేలును చూపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్..

ఢిల్లీ ఎన్నికలు 3

ఢిల్లీ ఎన్నికలు 3

తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి హర్ష వర్ధన్...

ఢిల్లీ ఎన్నికలు 4

ఢిల్లీ ఎన్నికలు 4

నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ..

ఢిల్లీ ఎన్నికలు 5

ఢిల్లీ ఎన్నికలు 5

ఢి్ల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత వెనక్కి వెళ్తూ ఓటరు గుర్తింపు కార్డును చూపుతున్న రాహుల్ గాంధీ ఇలా..

ఢిల్లీ ఎన్నికలు 6

ఢిల్లీ ఎన్నికలు 6

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కలిసి వెళ్తూ ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఇలా..

ఢిల్లీ ఎన్నికలు 7

ఢిల్లీ ఎన్నికలు 7

ఢిల్లీ శానససభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ప్రజలు..

ఢిల్లీ ఎన్నికలు 8

ఢిల్లీ ఎన్నికలు 8

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా మార్కు ఉన్న వేలిని చూపుతున్న రాహుల్ గాంధీ..

ఢిల్లీ ఎన్నికలు 9

ఢిల్లీ ఎన్నికలు 9

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి క్యూలో నించున్న సోనియా గాంధీ, షీలా దీక్షిత్

ఢిల్లీ ఎన్నికలు 10

ఢిల్లీ ఎన్నికలు 10

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి విక్టరీ సింబల్ చూపుతున్న కేజ్రీవాల్..

ఢిల్లీ ఎన్నికలు 11

ఢిల్లీ ఎన్నికలు 11

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నిర్మాణ్ భవన్‌లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన సోనియా గాంధీ, షీలా దీక్షిత్..

ఢిల్లీ ఎన్నికలు 12

ఢిల్లీ ఎన్నికలు 12

తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ప్రియాంక వాద్రా పోలిం్ కేంద్రంలోకి ప్రవేశిస్తున్న దృశ్యం

ఢిల్లీ ఎన్నికలు 13

ఢిల్లీ ఎన్నికలు 13

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా మార్కు వేలిని చూపుతున్న బిజెపి ముఖ్యమంత్రి హర్షవర్ధన్

ఢిల్లీ ఎన్నికలు 14

ఢిల్లీ ఎన్నికలు 14

ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఓ మహిళతో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ..

ఢిల్లీ ఎన్నికలు 15

ఢిల్లీ ఎన్నికలు 15

నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత సిరా మార్కు వేలిని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి షీలా దీక్షిత్

ఎన్నికలు 16

ఎన్నికలు 16

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నించున్న రాహుల్ గాంధీ

ఎన్నికలు 17

ఎన్నికలు 17

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులతో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్

ఎన్నికలు 18

ఎన్నికలు 18

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా మార్కు గల చూపుడు వేలిని ప్రదర్శిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+