వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్‌పై ఆటో డ్రైవర్ రేప్ యత్నం: రాళ్లతో కొట్టి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సమయంలోనే ఓ రష్యా యువతిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

బాధిత రష్యన్ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ వసంత్‌కుంజ్ పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఓ మోడలింగ్ ఏజెన్సీలో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రష్యన్ యువతి వసంత్‌కుంజ్ నుంచి గ్రీన్‌పార్క్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

delhi auto driver attempted rape to a russian girl arrested

నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన ఆ డ్రైవర్, మొదట ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. తనపై చేయి వేసేందుకు ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను తోసేసిన ఆ యువతి, అతడిని రాళ్లతో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంది.

ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఒబామా పర్యటనను పురస్కరించుకుని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

English summary
Despite the tight security, a young Russian woman tourist and an aspiring model was attacked by an auto driver who tried to rape her on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X