గాలి జనార్దన్ రెడ్డి కేసు: బీజేపీ లీడర్స్ నోటికి హైకమాండ్ తాళం, స్నేహం వ్యక్తిగతం, చాలు!
Recommended Video

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నోరుజారి సమస్యలకు గురి కాకూడదని కర్ణాటక బీజేపీ నాయకుల నోటికి తాళం వేస్తూ ఆ పార్టీ హైకమాండ్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డితో మీ స్నేహం వ్యక్తిగతం అని, ఈ కేసుకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేసే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ ఆందోళన చెందుతుందని తెలిసింది.

రూ. కోట్లలో మోసం, పెద్దనోట్ల రద్దు
ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులు రూ. కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో, పెద్దనోట్ల రద్దు సమయంలో కొత్త నోట్లు మార్పిడి చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో గాలి జనార్దన్ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చెయ్యడానికి బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు.

సీసీబీ పక్కా స్కెచ్
గురువారం బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయన స్నేహితుడు, మాళకాల్మూరు బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు సీసీబీ పోలీసుల విచారణకు సహకరిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మామ మహేశ్వర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

లైసెన్స్ లేని గన్ సీజ్?
గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో లైసెన్స్ లేని గన్, బుల్లెట్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని గురువారం కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన పీఏ ఆలీఖాన్ ఇంటిలో సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు.గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో లైసెన్స్ లేని గన్, బుల్లెట్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని గురువారం కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

ఢిల్లీకి గాలి కేసు సమాచారం
గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో జాగ్రత్తగా స్పంధించాలని కర్ణాటక బీజేపీ నాయకులకు హైకమాండ్ స్పష్టమైన సందేశం పంపించిందని సమాచారం. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి కేసు వివరాల సమాచారం తెలుసుకున్న బీజేపీ హైకమాండ్ కర్ణాటకలోని ఆ పార్టీ నాయకులకు పలు సూచనలు చేసిందని తెలిసింది.

స్నేహం వ్యక్తిగతం
గాలి జనార్దన్ రెడ్డితో మీకు స్నేహం ఉంటే అది వ్యక్తిగతం అని, అది పార్టీని ఇబ్బంది పెట్టే వ్యవహారం కాకూడదని ఆ పార్టీ హైకమాండ్ కర్ణాటక బీజేపీ నాయకులను హెచ్చరించిందని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి విషయంలో మీరు స్పందించే తీరు పార్టీ మీద ప్రభావం చూపితే తీవ్రపరిణామాలు ఉంటాయని బీజేపీ హైకమాండ్ హెచ్చరించిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఇప్పుడు అదే మాట
గత శాసన సభ ఎన్నికల సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో అదే మాట చెప్పాలని ఆపార్టీ హైకమాండ్, సీనియర్ నాయకులు నిర్ణయించారని తెలిసింది.












Click it and Unblock the Notifications