Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ పేలుళ్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..రంగంలోకి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన భయంకరమైన కారు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను, దర్యాప్తు వేగాన్ని సమీక్షిస్తూ ఆయన కీలక ప్రకటన చేశారు.

సోమవారం సాయంత్రం 6:55 గంటలకు ఎర్రకోట సమీపంలో హోండా ఐ20 (Honda i20) కారులో ఈ పేలుడు సంభవించినట్లు హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారులందరితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

Delhi Blast Update 13 Dead in Red Fort Honda i20 Explosion Home Minister Amit Shah Orders Fast Probe

ముఖ్యంగా, పేలుడుకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కాసేపట్లో ఆయన స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కి చేరుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమవ్వడంతో, ఆ దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ దాడిలో 30 మంది గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఎల్ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందే ఆసుపత్రికి వెళ్లిన అమిత్ షా, క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు మరియు ఆధారాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడు వెనుక కారణాలు, ఉగ్రవాద కోణం ఉందా అనే దిశగా స్పెషల్ సెల్, NIA, NSG బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+