మహిళపై అత్యాచారం: బిఎస్పీ నేత తనయుడి అరెస్టు

నిందితుడి ద్వారా తనకు ఓ కుమారుడు పుట్టాడని, అతనికి రెండేళ్ల వయస్సు ఉంటుందని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. నలబై ఏళ్ల వయస్సు గల శివభూషణ్‌కు చెందిన కర్మాగారంలో తాను 2010లో పనిచేస్తూ ఉండేదాన్నని ఆమె చెప్పింది.
శివభూషణ్ మంగోల్పూర్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్థి కుమారుడు. 2010లో తనకు శివభూషణ్ మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని, దాంతో తాను స్పృహ కోల్పోయానని, అప్పుడు అతను తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ వివరించింది. తనను వివాహం చేసుకుంటానని శివభూషణ్ హామి ఇచ్చినట్లు ఆమె తెలిపింది.
ఆ తర్వాత తాము ఓ అద్దె గదిలో కలిసి ఉంటూ వచ్చామని, తమకు సంతానం కూడా కలిగిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడడంతో శివభూషణ్ విడిగా ఉంటూ వచ్చాడు. తమకు నవంబర్ 22వ తేదీన ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications