బురారీ ఆత్మహత్యలు: మరో షాక్.. చివరి నిమిషంలో బతకాలని ఆరాటం

Recommended Video

    బురారీ ఆత్మహత్యలు: మరో షాక్.. చివరి నిమిషంలో బతకాలని ఆరాటం

    న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ 11 మంది ఆత్మహత్య కేసులో మరో కొత్త అంశం వెలుగు చూసింది. 50 ఏళ్ల వయస్సున్న భవనేష్ భాటియా చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేశాడు. అతను తన చేతిని గొంతు వద్ద పెట్టుకొనే ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో అతను చివరి నిమిషంలో బతకాలనుకున్నట్లుగా భావిస్తున్నారు.

    11 కుటుంబ సభ్యులు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో భవనేష్ ఆత్మహత్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి రావడం గమనార్హం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో దాని పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు.

    ఫోరెన్సిక్ నివేదికలోను ఇదే తేలింది

    ఫోరెన్సిక్ నివేదికలోను ఇదే తేలింది

    ఫోరెన్సిక్ నివేదికలోనూ ఇదే తేలిందని పోలీసులు చెబుతున్నారు. అందరూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో భాటియా పెద్ద కుమారుడు భవనేష్ చివరి నిమిషంలో ఆత్మహత్య వద్దనుకున్నాడు. దీంతో బయటపడేందుకు చివరి క్షణం వరకు ప్రాణాలతో పోరాడాడు.

    మెడకు బిగుసుకుంటున్న తాడును వదులు చేసే ప్రయత్నం

    మెడకు బిగుసుకుంటున్న తాడును వదులు చేసే ప్రయత్నం

    అతడి చేతులు అందరిలా బిగుతుగా కాకుండా వదులుగా కట్టి ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మెడకు బిగుసుకుంటున్న తాడును వదులు చేసేందుకు ప్రయత్నించినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు. చివరి క్షణం వరకు ప్రాణాలతో పోరాడినా బయటపడలేక మృతి చెందినట్టు పోలీసులు వివరించారు.

    130 మంది విచారణ

    130 మంది విచారణ

    కాగా, ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు 130 మందికి పైగా విచారించారు. బంధువులు, పక్క ఇంటి వారు, స్నేహితులు తదితరులను ఎంతోమందిని విచారించారు. వారి మృతికి మరిన్ని ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని విచారణ చేస్తున్నారు.

    ఆత్మహత్య చేసుకుంది వీరే

    ఆత్మహత్య చేసుకుంది వీరే

    ఆత్మహత్య చేసుకున్న వారిలో 77 ఏళ్ల నారాయణ్ దేవి, ఆమె ఇద్దరు కొడుకులు భవనేష్ భాటియా (50), లలిత్ భాటియా (45), వారి భార్యలు సవిత (48), టీనా (42), నారాయణ్ కూతురు ప్రతిభా (57), ఐదుగురు మనవలు, మనవరాళ్లు... ప్రియాంక(33), నీతు (25), మోను (23), ధ్రువ్ (15), శివమ్(15)లు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+