వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్‌కి తీసుకెళ్లి విదేశీ మహిళతో అసభ్యంగా క్యాబ్ డ్రైవర్, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

జైపూర్: ఢిల్లీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ బ్రిటిష్ దేశానికి చెందిన పర్యాటకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన జైపూర్‌లో వెలుగు చూసింది. ఈ విషయమై సదరు క్యాబ్ డ్రైవర్ పైన ఇరవై ఏళ్ల బ్రిటీష్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము రెస్టారెంట్ పైన డిన్నర్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాధితురాలు తన మరో మహిళా స్నేహితురాలితో కలిసి ఏప్రిల్ 9న క్యాబ్ పైన వచ్చారు.

భోజనం చేస్తుండగా 38 ఏళ్ల డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దాంతో తాను షాక్‌కు గురయ్యానని బాధితురాలు పోలీసులకు చెప్పారు. నిందితుడిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. అతనికి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

Delhi cabbie sexually assaults UK tourist in Jaipur

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన సలీమ్ ఖాన్ (38) ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. అతను గత ఇరవై ఏళ్లుగా పని చేస్తున్నట్లు పోలీసులకు చెప్పాడు.

ఇద్దరు విదేశీ మహిళళు ఇటీవల ఢిల్లీకి వచ్చారు. వారు ఖాన్ క్యాబ్‌ను మాట్లాడుకొని జైపూర్ వచ్చారు. వారు ఇద్దరు జల్ మహల్ దగ్గరిలోని హోటల్లో ఉంటున్నారు. ఓసారి ఖాన్ వారిని హోటల్ పైకి డిన్నర్ కోసం తీసుకు వెళ్లాడు. ఆ సమయంలో మిగతా కస్టమర్లు ఎవరు లేరు.

ఆ సమయంలో ఖాన్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. వారు అతని నుండి తప్పించుకొని వచ్చారు. వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు అతను ఉంటున్న చోటకు వెళ్లారు. వారు అంతలోనే పోలీసులకు ఫిర్యాదు చేయరని భావించిన నిందితుడు, అక్కడే ఉన్నాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Delhi driver sexually assaults UK tourist in Jaipur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X