జిందాల్‌కు కేజ్రీవాల్: టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లిన 'సామాన్యుడు', విమర్శలు

బెంగళూరు: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెంగళూరు చేరుకున్న ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్‌కు జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేస్తున్నారు. జిందాల్ ప్రకృతి చికిత్సాలయం వైద్యుడు డాక్టర్ బబినా నందకుమార్ క్రేజీవాల్‌కు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ.. క్రేజీవాల్‌కు చక్కర వ్యాది కంట్రోల్ కావడం లేదన్నారు. ఎప్పటి కప్పుడు షుగర్ టెస్ట్ చేస్తు అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నామన్నారు.

క్రేజీవాల్‌కు చక్కర వ్యాధి, అధిక రక్తపోటు, జలుబు, దగ్గు ఎక్కువగా ఉందని చెప్పారు. గురువారం క్రేజీవాల్‌కు షుగర్ టెస్ట్, రక్తపోటు, ఇసీజీ, ఆయిల్ మసాజ్, స్టీం బాత్, డి ట్యాక్సీకేషన్ చికిత్సలు చేశామని చెప్పారు. 10 రోజుల పాటు క్రేజీవాల్‌కు చికిత్స అందిస్తామని, అంతలోపు ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందన్నారు.

క్రేజీవాల్ మాట తప్పారు!

Delhi Chief Minister and Aam Aadmi Party Chief Arvind Kejriwal will be visiting the Jindal Nature Care Institute in the city

గురువారం మద్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ బెంగళూరు శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అప్పటికే కర్ణాటక ప్రభుత్వం అరవింద్ క్రేజీవాల్ ప్రయాణించడానికి వీలుగా వీవీఐపీలు ఉపయోగించే కారును విమానాశ్రయం దగ్గరకు పంపించారు. అయితే తాను ప్రయివేటు పని మీద వచ్చానని, వీవీఐపీ వాహనం తనకు వద్దని క్రేజీవాల్ చెప్పారు.

అనంతరం ఏఏపీ కర్ణాటక నాయకుడు పృథ్వీ రెడ్డి కారులో క్రేజీవాల్ ప్రయాణించారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జిందాల్ ప్రకృతి చికిత్సాలయం దగ్గరకు వెళ్లే మార్గంలో రెండు టోల్ గేట్లు ఉన్నాయి. టోల్ గేట్లలో వీవీఐపీలు, వీఐపీలు టోల్ ఫీజు చెల్లించరు.

ఈ రెండు టోల్ గేట్ల దగ్గర క్రేజీవాల్ ప్రయాణించిన కారుకు టోల్ ఫీజు చెల్లించలేదు. వీఐపీ గేట్ ద్వార క్రేజీవాల్ జిందాల్ ప్రకృతి చికిత్సాలయం దగ్గరకు వెళ్లారని కర్ణాటక రోడ్డు రవాణ శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. తాను సామాన్యుడు, వీఐపీలకు కల్పించే సదుపాయాలు తనకు వద్దని పదే పదే చెప్పిన అరవింద్ క్రేజీవాల్ టోల్ గేట్లలో ఎందుకు ఫీజు చెల్లించలేదని రామలింగా రెడ్డి ప్రశ్నించారు.

క్రేజీవాల్ పదేపదే చెప్పిన నీతులు ఎందుకు పాటించలేదు అనే విషయం ఆయనకే తెలియాలని మంత్రి రామలింగారెడ్డి వివరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ తాము పంపిన కారును వెనక్కి పంపించడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+