దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల దాడి, ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు, పోలీసుల మోహరింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయవ్య ఢిల్లీలోని జహంగీర్‌పుర్ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ వర్గంవారు రాళ్లు రువ్వడం వల్ల హింస చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అంతేగాక, కొన్ని వాహనాలను దుండగులు తగలబెట్టారని పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా ఈ ఘటనలపై మాట్లాడుతూ.. "అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. జహంగీర్‌పురి, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాం. సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి శాంతిభద్రతలను నిశితంగా పర్యవేక్షించి పెట్రోలింగ్ చేపట్టాలి. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పౌరులు పట్టించుకోవద్దని సూచించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడి హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని పేర్కొన్నాయి.
హోంశాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అవసరమైన ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఢిల్లీలో ఘర్షణ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
2) Radical mob is gathering for the violence at Hanuman Janmotsav procession in Delhi's Jahangirpuri. pic.twitter.com/Sdev121PGs
— Anshul Saxena (@AskAnshul) April 16, 2022
ఘర్షణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'దేశ రాజధానిలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రజలంతా సంయమనం పాటించాలి. లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడా. శాంతి భద్రతల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దోషులను వదిలే ప్రసక్తే లేదు' అని వ్యాఖ్యానించారు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభయాత్రలపై రాళ్లదాడులు జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications