కార్యకర్త పుట్టిన రోజంట.. ముఖ్యమంత్రి వచ్చారంట.. ఫోటో వైరల్

ఢిల్లీ : ఎన్నికల వేళ నేతలు ప్రజాక్షేత్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తారు. ప్రజలతో మమేకం అవుతూ దండాలు పెడుతూ ఓట్ల కోసం ఎన్నో రకాల ఫీట్లు చేస్తారు. ఓట్ల పండుగ సమయంలో సాదాసీదాగానే ఉంటారు. గెలిచాక మాత్రం జాడ లేకుండా పోతారు. ఒకవేళ కలవాలని ప్రయత్నించినా విసుక్కుంటారు. ఇదంతా కూడా కొందరి నేతల విషయంలోనే. ఇంకొందరు నేతలుంటారు ముఖ్యమంత్రైనా, మంత్రైనా జనాల మధ్య ఉండటానికే ఇష్టపడతారు. ఆ కోవలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్తల్లోకెక్కారు.

పార్టీ కార్యకర్త పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు చాలాసేపు వారింట్లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓ సామాన్య కార్యకర్త ఇంటికి రావడమా అంటూ ఇరుగుపొరుగున ఉండేవారు ముక్కున వేలేసుకున్నారట. కార్యకర్త పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ దగ్గరుండి ఆయనతో కేక్ కట్ చేయించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

delhi cm aravind kejriwal attended party worker birthday photo viral

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త వివేక్ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీమ్‌లో పనిచేస్తున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఇంటికి రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అత్యంత సాధారణంగా తన చేయి పట్టి కేక్ కట్ చేయించడం జీవితంలో మరచిపోలేని రోజంటూ పొంగిపోతున్నారు. ఇది ఓ మామూలు కార్యకర్తకు ఓ అసాధారణమైన ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవమంటూ బర్త్‌డే ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు కేజ్రీవాల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. దాంతో ఆయన కూడా స్పందించారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే మా పార్టీకి గొప్ప బలమని.. వారి సాయంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దేశ సేవ చేస్తోందని రిప్లై ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+