కమల్ హాసన్ ఇంటిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, చర్చలు మొదలు, పుకార్లు వద్దు, సన్నిహితులు !

Delhi CM Arvind Kejriwal to meet Kamal Hassan at Chennai on Thursday. Delhi CM Arvind Kejriwal to meet Kamal Hassan at Chennai on Thursday.

చెన్నై: ఆప్ జాతీయ కన్వీనరన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై చేరుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కమల్ హాసన్ కుమార్తె అక్షరాహాసన్ ఘనంగా స్వాగతం పలికి ఇంటికి పిలుచుకుని వెళ్లారు. ఇంటికి వచ్చిన కేజ్రీవాల్ ను కమల్ హాసన్ పుష్పగుచ్చం ఇచ్చి అహ్వానించారు.
కేజ్రీవాల్ వెంట ఢిల్లీ నుంచి వచ్చిన మరికొందరు ఆప్ నేతలు కమల్ ఇంటికి వెళ్లారు.

రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో పదేపదే చెబుతున్నారు. బిగ్ బాస్ షో పూర్తి అయిన వెంటనే రాజకీయాలపై దృష్టిపెడుతానని ప్రకటించారు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రితో కమల్ హాసన్ భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది.

Delhi CM Arvind Kejriwal to meet Kamal Hassan at Chennai

తాను కాషాయం రంగుకాదంటు గతంలో బీజేపీ మీద కమల్ హాసన్ సెటైర్లు వేశారు. బీజేపీని చూస్తే కేజ్రీవాల్ కు ఎంత మాత్రం గిట్టదు. కమల్ హాసన్ ఆప్ లోకి చేరుతారని జోరుగా ప్రచారం జరగడంతో ఆయన సన్నిహితులు మాత్రం ఆ వార్తలను ఖండించారు.

కమల్ హాసన్ మనసులో ఎముందో ఇంత వరకు మాకే చెప్పలేదని, ఆయనకు ఏ పార్టీతో శత్రుత్వం లేదని, మర్యాదపూర్వకంగా ఇద్దరూ భేటీ అవుతున్నారని అంటున్నారు. మొత్తం మీద కమల్ హాసన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అంటూ ఆయన అభిమానులతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+