"సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్"
బీజేపీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం రేషన్ కార్డ్ హోల్డర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. దిల్లీలోని పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రతిపాదనను సీఎం రేఖా గుప్తా ఆమోదించారు. ఈ మేరకు తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. దిల్లీలోని అర్హులైన కుటుంబాలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని ప్రకటించారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి రూ.242 కోట్ల బడ్జెట్ ను ఆమోదించారు.
దిల్లీ ప్రజలకు అక్కడి బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఈ ప్రతిపాదనను సీఎం రేఖా గుప్తా ఆమోదించారు. దాంతో దిల్లీలోని సుమారు 17.5 లక్షల రేషన్ కార్డ్ హోల్డర్లకు ఈ ప్రయోజనం కలుగుతుంది. ఏడాదికి రెండు సార్లు అంటే ఒకటి హోలీ పండుగ సందర్భంగా.. మరొకటి దీపావళి పండుగ సందర్భంగా ఈ ఉచిత సిలిండర్లను అందించనున్నారు.

ఇక ఇది నగదు బదిలీ(DBT) పద్ధతిలో అమలు చేసే పథకం అని చెప్పొచ్చు. ఒక సిలిండర్ ధర రూ. 853 నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఇంట్లో పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) వాడుతున్న రేషన్ కార్డ్ హోల్డర్లకు కూడా రూ. 853 నగదు ప్రయోజనం వర్తిస్తుందని దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి రూ.242 కోట్ల బడ్జెట్ ను ఆమోదించారు. ఇక గతేడాది దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకుంది దిల్లీ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications