'రొమాన్స్ ను రోడ్డెక్కించేసిన ప్రేమ జంట' (వీడియో)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : రొమాన్స్ ను రోడ్డెక్కించేసిన ఓ ప్రేమ జంట ట్రాఫిక్ సిగ్నల్ వద్దే ముద్దు ముచ్చట్లకు తెరలేపింది. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ ను కాస్త.. రొమాన్స్ కు గ్రీన్ సిగ్నల్ గా మార్చుకున్న ఈ ప్రేమ జంట పక్కనున్న ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా రొమాన్స్ లో మునిగిపోయింది.

ఢిల్లీలోని ఓ ట్రాఫిక్ పాయింట్ వద్ద చోటు చేసుకున్న ఈ రొమాన్స్, ఇంటర్నెట్ లోకి ఎక్కడంతో వైరల్ గా మారిపోయింది. వీడియోలో కనిపిస్తోన్న దృశ్యం ప్రకారం.. బైక్ ముందు భాగంలో పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొన్న అమ్మాయి, బైక్ డ్రైవ్ చేస్తోన్న అబ్బాయి చుట్టూ రెండు కాళ్లు వేసి కూర్చొంది. పక్కన ఎంతమంది వాహనాదారులు ఉన్నా..! అదేమి పట్టనట్టు ముద్దులు, కౌగిలింతలతో ప్రపంచాన్నే మరిచిపోయారు ఈ జంట.

అయితే ఈ రొమాన్స్ వీడియో సీసీటీవీలో రికార్డయిందా..? లేక ఎవరైనా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారా..? అసలు ఎవరీ జంట..? అన్న వివరాలు తేలలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This video of a couple in Delhi is going viral as they chose to kill traffic time with romance. A boy and girl were spotted kissing on bike while stuck in traffic.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X