బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసు: ఉగ్రవాది అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష వేసిన ఢిల్లీ కోర్టు, 11 లక్షల జరిమానా కూడా

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 12 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ప్రధాన దోషి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది. దీంతోపాటు రూ. 11 లక్షల జరిమానా కూడా విధించింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. న్యూఢిల్లీలోని కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాస్, ఇండియా గేట్ వద్ద బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు జామియా నగర్‌లోని ఎల్-18 బాట్లా హౌస్‌లో దాక్కున్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Delhi Court Awards Death Sentence To Convict Ariz Khan In Batla House Encounter Case

బాట్లా హౌస్‌కు పోలీసులు చేరుకోగానే.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబ్డడారు. ఈ కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మకు బుల్లెట్ తగలడంతో ఆయన మరణించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. అరిజ్ ఖాన్, షాజాద్, జునైద్ పారిపోగా, మహ్మద్ సైఫ్ అనే మరో ఉగ్రవాది పోలీసులకు లొంగిపోయాడు.

ఆ తర్వాత పరారైన షాజాద్‌ను 2010తో ఉత్తరప్రదేశ్‌లోని అజాంగఢ్‌లో అరెస్ట్ చేశారు. అతడిపై రెండు ఛార్జీషీట్లు దాఖలయ్యాయి. మోహన్ చంద్ శర్మను హత్య చేసిన కేసులో 2013లో అతడికి జీవితఖైదు పడింది. ఇక 2018లో భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరిజ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే బాట్లా ఎన్ కౌంటర్ కేసులు అరిజ్ ఖాన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు.. తాజాగా అతడికి మరణశిక్ష విధించింది. 2008లో ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరుస బాంబు పేలుళ్లలో కూడా అరిజ్ కీలక పాత్ర పోషించారని పోలీసులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+