లైంగిక దాడి: తేజ్‌పాల్‌కు ముందస్తు బెయిల్ నో
న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మహిళా జర్నలిస్టుపై తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తేజ్‌పాల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని గోవా పోలీసులు వాదించారు.
తేజ్‌పాల్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సమాధాన్ని సమర్పించాలని జస్టిస్ సునీతా గుప్తా గోవా పోలీసులను ఆదేశించారు. స్వభావంలో విషయం తీవ్రమైందని గోవా పోలీసులు వాదించారు. పోలీసులు సమాధానం సమర్పించేవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ తరఫున న్యాయవాది గీతా లూత్రా కోరారు. ఆమె విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

ఈ నెలారంభంలో థింక్‌ఫెస్ట్ సదస్సు సందర్భంగా గోపాలోని పానాజీలో గల గ్రాండ్ హయత్ ఫైవ్ స్టార్ రిసార్ట్‌లోని క్లబ్ హౌస్ సెక్షన్ ఎలివేటర్‌లో తరుణ్ తేజ్‌పాల్ తనపై రెండు సార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడని మహిళా జర్నలిస్టు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి చేసిన ఫిర్యాదులో ఆరోపించింది.
తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు మంగళవారంనాడు మెజిస్ట్రేట్ ముందు బాధిత మహిళా జర్నలిస్టు వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ముంబై చేరుకున్నారు. మహిళా జర్నలిస్టును పోలీసులు సోమవారం సంప్రదించి విషయం చెప్పారు. సునీతా సావంత్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు.












Click it and Unblock the Notifications