వీడు మామూలోడు కాదు భయ్యా..! 24 ఏళ్ల పాటు పోలీసులకు చుక్కలు.. చివరికి

దాదాపు 24 ఏళ్లపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు దొరికిపోయాడు ఓ సీరియల్ కిల్లర్. 2001 నుంచి పలు హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఏళ్ల తరబడి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు. 24 ఏళ్ల పాటు పలు హత్యలు, చోరీలకు పాల్పడినట్లు పోలీసుల రికార్టులో ఉంది. నిందితుడు క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001 నుంచి వరుస హత్యలకు పాల్పడినట్లు సమాచారం. సుదీర్ఘకాలం వేట తర్వాత సీరియల్ కిల్లర్ చిక్కడంతో దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు ఓ సీరియల్ కిల్లర్ ను అరెస్ట్ చేశారు. 2001 నుంచి వరుస హత్యలకు పాల్పడిన నిందితుడు అజయ్ లంబాను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడు హత్య చేసే విధానం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. క్యాబ్‌ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు చిక్కాడు.

Delhi Crime Branch Nabs Serial Killer Ajay Lamba After Two Decades

దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన పలువురు క్యాబ్ డ్రైవర్లను అజయ్ లంబా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుతాడు.. అలా మార్గమధ్యలో క్యాబ్ డ్రైవర్ ను చంపేసి నేపాల్ సరిహద్దుల్లో పడేస్తాడు. క్యాబ్ ను పార్ట్స్ చేసి అమ్మేస్తాడు. ఇలా 2001 లో నాలుగు హత్యలు ఆ తర్వాత మరికొన్ని చోరీలు, హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి అజయ్ బంగా పరారీలో ఉన్నాడు. తాజాగా దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత సీరియల్ కిల్లర్ అజయ్ లంబా చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

48 ఏళ్ల అజయ్ లంబా స్వస్థలం దిల్లీ. ఆరో తరగతి వరకు చదివిన అజయ్ లంబా.. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఓ ఇద్దర్ని హతమార్చినట్లు తేలింది. అతడు 2008 నుంచి 2018 వరకు నేపాల్ లో ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ కు మకాం మార్చాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+