ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2025: వేగవంతమైన కవరేజ్ కోసం డైలీహంట్‌కు ట్యూన్ అవ్వండి..!!

గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగింది. చివరకు ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అంతా ప్రశాంతంగానే ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు దాఖలాలు లేవు. ఇక సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 70 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 602 మంది పురుష అభ్యర్థులు ఉండగా 96 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ బరిలో నిలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అప్పుడు 668 అభ్యర్థులు పోటీ చేశారు. ఈ సారి మరో 31 మంది అభ్యర్థులు ఎక్కువయ్యారు.

Delhi Election Results 2025 Tune Into Dailyhunt To Get The Fastest Coverage

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం మూడోసారి దక్కించుకోవాలని చూస్తుండగా.. కేజ్రీవాల్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరం పాటించింది.ఒంటరిగానే పోటీ చేసి బీజేపీకి సవాలు విసిరింది.

ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో 83.49 లక్షల మంది పురుష ఓటర్లు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు మరో 1267గా నమోదయ్యారు.వీరందరిలో 2.08 లక్షల మంది తొలిసారిగా ఓటు వినియోగించుకుంటున్నవారిగా తెలుస్తోంది. ఇక 6500 మంది సీనియర్ సిటిజెన్లకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది.1051 మంది దివ్యాంగులకు కూడా ఈ సదుపాయం ఏర్పాటు చేసింది.

డైలీహంట్ లైవ్ కవరేజ్

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడుతాయి. ఈ ఫలితాలను డైలీహంట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫలితాలు అంటే కేవలం సంఖ్యాపరంగానే కాదు.. ఎన్నికల ఫలితాల విశ్లేషణతో పాటు గెలుపోటములకు కారణాలు విశ్లేషించే నిపుణుల విశ్లేషణ కూడా ఉంటుంది. డేటా, ట్రెండ్స్, పాలనపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఇలా చాలా అంశాలతో కూడిన విశ్లేషణలు ఉంటాయి.

వీటి కోసం ట్యూన్ ఇన్ అవ్వండి:

* సులభంగా అర్థమయ్యేలా ఉండే లైవ్, రియల్ టైమ్ అప్‌డేట్స్

* సీట్లు, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్

* గత ఎన్నికల ఫలితాలను పోలుస్తూ విశ్లేషణలు

* సోషల్ మీడియా రియాక్షన్స్, ట్విటర్ ట్రెండ్స్, విశ్లేషకుల విశ్లేషణలు

* లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండ్ అయ్యే ఎన్నికల కథనాలు

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నికచ్చిగా ఉండే విశ్లేషణలు, ఇతర అప్‌డేట్స్ కోసం డైలీ హంట్‌ను ఫాలో అవ్వండి. పూర్తి స్థాయి కవరేజ్ కోసం, మరిన్ని ఇన్‌సైట్స్ కోసం డైలీ హంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+