ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ, చత్తీస్‌గడ్ టగ్గాఫ్ వార్, ఎంపి బిజెపి
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల్లో దాదాపు 74శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2008 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 57.58శాతం కంటే ఇది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. కాగా టైమ్స్ నౌ సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు తీసుకున్న సమాచారం మేరకు ఢిల్లీ అసెంబ్లీలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీకి 32 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 18 స్థానాలు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 41, బిజెపికి 44 సీట్లు, మధ్యప్రదేశ్‌లో బిజెపికి 145 సీట్లు, కాంగ్రెస్‌కు 77 సీట్లను సాధించినట్లు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. రాజస్థాన్‌లో 130 సీట్లను బిజెపి సాధించింది. మధ్యాహ్నం వరకు 66శాతం పోలింగ్ శాతం నమోదైంది. సుమారు 1.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications