రేవంత్ రెడ్డి చేతి చలువ
CM Atishi: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముణ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆ రోజు నుంచి నామనేషన్లను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 17.

ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లోక్‌సభ సభ్యుడు మల్లు రవి సహా ఢిల్లీ పీసీసీకి చెందిన పలువురు సీనియర్ నాయకుల చేతుల మీదుగా ఈ మేనిఫెస్టో విడుదలైంది.
ఈ సందర్భంగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీలను అమలు చేస్తుందని ప్రకటించారు. 500 రూపాయలకే ఎల్పీజీ వంటగ్యాస్, ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కిట్లను ఉచితంగా అందజేస్తుందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నదాతల కోసం రైతు బంధు, గృహావసరాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..వంటి గ్యారంటీలను అమలు చేస్తోన్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో భాగస్వామ్యమైన భారత్ రాష్ట్ర సమితిని తెలంగాణలో ఓడించామని, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పార్ట్‌నర్‌ను మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీని పాలించిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించిన షీలా దీక్షిత్ పాలనను కంపేర్ చేసి చూడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల ఢిల్లీ వాతావరణం విషతుల్యంగా మారిందని రేవంత్ విమర్శించారు. ఢిల్లీకి వచ్చినా, ఇక్కడి నుంచి వెళ్లినా ఆసుపత్రుల పాలవుతారంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రవేశపెట్టిన మెట్రో రైల్ వ్యవస్థ ఇప్పుడు దేశానికే ఆదర్శవంతమైందని, అన్ని రాష్ట్రాలు, నగరాల్లోనూ మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications