ఢిల్లీ ఎన్నికలు: ఒక్క కేజ్రీ కోసం 120 మంది బీజేపీ ఎంపీలు, బరిలో 673 మంది

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతుంది. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుల్ మెజార్జీని సాధించేందుకు గాను ఆ పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. గురువారం న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన పార్టీ ముఖ్య నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు 13 రాష్ట్రాలకు చెందిన 120 మంది బీజేపీ ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. అంతకు ముందు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలను బరిలోకి దింపుతామని కేంద్ర మంత్రి అనంత కుమార్ అన్న విషయం తెలిసిందే.

వచ్చే వారం రోజుల్లో 250 ర్యాలీలు ఆ పార్టీ నిర్వహిస్తుంది. వీటిల్లో ప్రధాని నరేంద్రమోడీ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని అయన పేర్కొన్నారు. ప్రతి నియోజక వర్గంలో 1000 బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో రెండొంతుల మెజార్జీ సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 Delhi elections: Amit Shah takes command, brings in 120 BJP MPs to back Kiran Bedi

‘బిజెపి ఈసారి మేనిఫెస్టో విడుదల చేయదు, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం అభ్యర్థి బేడీ కలిసి విజన్ డాక్యుమెంట్ మాత్రమే విడుదల చేస్తారు' అని అనంతకుమార్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కీజ్రీవాల్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై నిప్పులు చెరిగారు.

ఒకప్పుడు తాను కిరణ్ బేడీకి ముఖ్య మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినా స్పందించలేదనీ, ఇప్పుడెందుకు అవినీతి నాయకుల పార్టీ అయిన బీజేపీలో చేరారని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు. బీజేపీని ఆమె మారుస్తారా? లేకా ఆమెను బీజేపీ మారుస్తుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఢిల్లీ ఎన్నికల బరిలో 673 మంది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 70 నియోజక వర్గాలకు గాను 673 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీరిలో 63 మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు. బీజేపీ 69, ఆప్ 70, కాంగ్రెస్ 70, బీఎస్పీ 70 స్ధానాలకు తమ అభ్యర్ధులను బరిలో నిలిపారు.

ఎన్సీపీ నుంచి 9, సీపీఐ నుంచి 5, సీపీఎం నుంచి 3 బరిలో ఉన్నారు. 377 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. బురారి నియోజక వర్గం నుంచి అత్యధికంగా 18 మంది, అంబేత్కర్ నగర్ నుంచి అత్యల్పంగా నలుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

ఫిబ్రవరి 7న జరగనున్న ఎన్నికల పోలింగ్ కోసం 12,083 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,33,14,215 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+