గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!

కొత్త కారు కొనాలనుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టే దిశగా 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026' ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలకే కాకుండా 'స్ట్రాంగ్ హైబ్రిడ్' కార్లకు కూడా భారీ పన్ను మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే హైబ్రిడ్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఢిల్లీలో హైబ్రిడ్ వాహనాలకు ఎటువంటి ప్రత్యేక పన్ను ప్రయోజనాలు లేవు. పెట్రోల్ కార్ల మాదిరిగానే వీటిపై కూడా 10% రోడ్ ట్యాక్స్ విధిస్తున్నారు. అయితే కొత్త ముసాయిదా ప్రకారం, రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధర ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలలో 50 శాతం తగ్గింపు లభించనుంది. దీనివల్ల మోడల్‌ను బట్టి కొనుగోలుదారులకు రూ. 80 వేల నుండి రూ. 1.45 లక్షల వరకు ఆన్-రోడ్ ధరలో పొదుపు అయ్యే అవకాశం ఉంది.

New Delhi EV Draft Policy Massive Tax Relief for Hybrid Car Buyers Toyota Innova and Maruti Invicto to Cost Less

ఏ మోడల్‌పై ఎంత ఆదా?

ఈ నిర్ణయం వల్ల మారుతి సుజుకి, టయోటా, హోండా వంటి కంపెనీల కార్లకు డిమాండ్ పెరగనుంది. నిపుణుల అంచనా ప్రకారం ప్రధాన మోడళ్లపై లభించే తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి:

  • టయోటా ఇన్నోవా హైక్రాస్: రూ. 1.34 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు.
  • మారుతి ఇన్విక్టో: రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.44 లక్షల వరకు.
  • మారుతి గ్రాండ్ విటారా / టయోటా హైరైడర్: రూ. 83 వేల నుంచి రూ. 1.01 లక్షల వరకు.
  • హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ: దాదాపు రూ. ఒక లక్ష వరకు.

ఈవీలకు 100% మినహాయింపు

హైబ్రిడ్ కార్లకు 50 శాతం రాయితీ ఇస్తుండగా, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తోంది. రూ. 30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. అంటే ఈవీలను కొనేవారు ఎటువంటి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా హైబ్రిడ్‌ల కంటే ఈవీల కొనుగోలు వ్యయం మరింత తక్కువగా ఉండనుంది.

2030 వరకు అమల్లో..

ప్యాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్ర, త్రిచక్ర మరియు వాణిజ్య వాహనాల విద్యుదీకరణకు కూడా ఈ పాలసీ ప్రాధాన్యత ఇస్తోంది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ ముసాయిదాపై 30 రోజుల్లోగా ప్రజల, నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది. తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ విధానం మార్చి 31, 2030 వరకు చెల్లుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+