Delhi Liquor scam: సుప్రీంకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్..ఈ సారి గట్టిగానే..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఏ1గా ఉన్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో ఈ కేసుతో సంబంధాలున్నట్లు ఆరోణలు ఎదుర్కొంటున్న ఇతరులు కూడా బెయిల్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత కూడా బెయిల్‌‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశే ఎదురైంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనను సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వాస్తవానికి జూలై 12వ తేదీనే అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్ డీల్ చేస్తున్న కేసు కావడం విశేషం. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినప్పటికీ ఉరట దక్కలేదు. అంతకుముందే అంటే జూన్ 26వ తేదీన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కేజ్రీని అరెస్టు చేసింది. తాజాగా ఆ కేసుపైనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ తరపున సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వీ, చందర్ ఉదయ్ సింగ్‌లు వాదనలు వినిపిస్తారు. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ కేసును అత్యవసరంగా లిస్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించారు. అభ్యర్థన పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సింగ్ ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తిని పంపాలని సూచించారు.

Delhi Excise Policy Case Arvind Kejriwal Appeals to SC Against CBI Arrest

ఇక సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యర్థించారు. మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 45 కింద మూడు బెయిల్ ఆర్డర్లు వచ్చాయని గుర్తుచేసిన సింఘ్వీ... సెక్షన్ 45 ఇందుకు వర్తించదని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చారు. జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.90 రోజులకు పైగా జైలు జీవితం గడిపారని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం...కేజ్రీవాల్ ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అనే అంశాన్ని గుర్తు చేస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టిన కేజ్రీవాల్ తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆగష్టు 5న వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని సమర్థించింది. దీంతో కేజ్రీవాల్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ముందుగా ట్రయల్ కోర్టు నుంచి రిలీఫ్ పొందాలని సూచిస్తూ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+