కాలుష్యానికి చెక్.. ఢిల్లీలో నేటి నుంచి కొత్త రూల్స్ !!
భారత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-4 ఆంక్షలను అమలు చేయనుంది. ఈ ఆంక్షల్లో భాగంగా బీఎస్-6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాల ప్రవేశంపై నేటి ( డిసెంబర్ 18, 2025 ) నుంచి ఢిల్లీలో సంపూర్ణ నిషేధం విధించింది. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ నింపకూడదని పెట్రోల్ బంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నిర్ణయాలు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా వంటి నగరాల నుంచి ప్రతిరోజూ రాకపోకలు సాగించే వాహనాలపై భారీ ప్రభావం చూపనున్నాయి. ఈ ఆంక్షలతో సుమారు 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది.

కాగా ఘజియాబాద్ నుంచి 5.5 లక్షలు, నోయిడా నుంచి 4 లక్షలు, గురుగ్రామ్ నుంచి 2 లక్షల వాహనాలు ఢిల్లీకి ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం 126 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. 580 మంది పోలీసు సిబ్బందితో పాటు 37 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దించింది.
ఢిల్లీ సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, బీఎస్-6 ప్రమాణాలు లేని వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. పీయూసీ సర్టిఫికెట్ అమలుపై పర్యవేక్షణకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల సహాయంతో పీయూసీ లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు.
అంతే కాకుండా పీయూసీ లేకుండా ఇంధనం నింపితే బంకులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పొగమంచు, నిర్మాణ పనులు, పరిశ్రమల ఉద్గారాలతో పాటు పాత వాహనాలే కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈసారి ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తోంది.
మరోవైపు కాలుష్య తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా ఉపయోగించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
పార్లమెంట్‌లో చర్చ..
ఢిల్లీలో తీవ్ర కాలుష్య పరిస్థితిపై లోక్‌సభలో ప్రత్యేకంగా చర్చ జరగనుంది. ఈ అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వివరణ ఇవ్వనున్నారు. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు తాత్కాలికంగా ప్రజలకు అసౌకర్యం కలిగించినా.. దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కీలకంగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు.
-
వాహనదారులపై మరో బాదుడు గ్యారెంటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications