Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామ్ దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్..!

పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఓ కొత్త షర్బత్‌ను ప్రచారం చేస్తూ 'షర్బత్ జీహాద్' అనే పదాన్ని ఉపయోగించటం తీవ్ర స్థాయిలో విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు అనుచితమైనవిగా, అసహనానికి దారితీసేలా ఉన్నవిగా పేర్కొంది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమాజానికి సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యానించింది.

కారణం ఏంటంటే..

రామ్‌దేవ్ బాబా పతంజలి సంస్థ నుంచి విడుదల చేసిన 'రోజ్ షర్బత్' ప్రమోషన్ వీడియోలో మాట్లాడుతూ... కొన్ని షర్బత్లు అమ్ముడవుతున్న డబ్బులతో మసీదులు, మద్రసాలు నిర్మిస్తున్నారని, అదే మీరు పతంజలి షర్బత్ తాగితే గురుకులాలు, యూనివర్సిటీలు నిర్మించవచ్చునని అన్నారు. ఈ వ్యాఖ్యల్లో ''షర్బత్ జీహాద్'' అనే పదాన్ని వాడటంతో వివాదాస్పదంగా మారింది.

delhi-high-court-is-serious-about-ramdev-baba

దీంతో ఈ వ్యాఖ్యలు రూ అఫ్జా పానీయంను ఉద్దేశించి చేసినవిగా భావించిన హమ్‌దర్ద్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వారి ఉత్పత్తికి నష్టం వాటిల్లేలా, ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ ప్రకటనను వెంటనే తొలగించాలని కోర్టును కోరింది. హమ్‌దర్ద్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఇది కేవలం వ్యాపార ప్రకటన కాదని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నమని తెలిపారు.

ఈ క్రమంలోనే ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ నేహా బన్సల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ రూపంలోనూ సమర్థనీయం కావని.. వ్యక్తిగత నమ్మకాలు, సామాజిక బాధ్యత మధ్య గీత దాటి మాట్లాడటం తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పతంజలి తరపున విచారణకు హాజరైన ప్రాక్సీ కౌన్సెల్ విచారణ వాయిదా కోరగా.. మధ్యాహ్నానికి కల్లా పతంజలి ప్రధాన లాయర్ కోర్టులో హాజరుకావాలని లేకపోతే తీవ్రమైన ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు.

దీంతో పతంజలి ప్రధాన న్యాయవాది కోర్టుకు హాజరై వివాదాస్పద వీడియోను తొలగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు విడుదల చేయబోమని స్పష్టం చేశారు. హమ్‌దర్ద్ సంస్థకు ఇబ్బంది కలిగించే ప్రకటనలు మళ్లీ జరగవని వివరించారు. ఒక వారంలోపల అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. గతంలో సైతం తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణల నుంచి బహిరంగ క్షమాపణలు తీసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+