స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. అవసరం తీరాక..

స్నేహం, నమ్మకం అనే పదాలకే మచ్చతెచ్చేరీతిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పన్నాగంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. ఆమెతో సరదా తీరిన తర్వాత గర్భవతిని చేసి పారిపోయాడు. దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

బాధితురాలి భార్త.. ఓ నేరంలో దోషిగా తేలడంతో రెండేండ్ల జైలు శిక్ష పడింది. భర్త జైలు పాలు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోన్న ఆమెపై.. అతని స్నేహితుడొకడు కన్నేశాడు. తరుచూ ఇంటికి వెళ్లి, సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. నేరస్తుడైన భర్తను వదిలేస్తే.. పెండ్లి చేసుకుంటానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ కామాంధుడు స్నేహితుడి భార్యపై చాలాసార్లు లైంగికదాడి చేశాడు.

delhi man abscond after making friends wife pregnant

ఈమధ్యే బాధిత మహిళ గర్భందాల్చడంతో ఆ మోసగాడు చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడని పేర్కొంది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+