హెవీ ట్రాఫిక్‌తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్‌తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!

న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపోయి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే హెవీ ట్రాఫిక్ తో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వినడానికి చాల ఆశ్చర్యంగా ఉన్నా హెవీ ట్రాఫిక్ తో కిడ్నాప్ కు గురైన వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

సచిన్ పాఠక్ అనే వ్యక్తిని ఢిల్లీలోని ఓక్లా బర్డ్న్ మెట్రో స్టేషన్ సమీపంలో నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. తరువాత కారును కలిండ్ కుంజ్ గడ్ ప్రాంతం వైపు నడిపారు. ఆ సమయంలో కిడ్నాపర్లు వెలుతున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది. హెవీ ట్రాఫిక్ తో కిడ్నాపర్లు అయోమయానికి గురైనారు.

కారును యూ టర్న్ తీసుకున్న కిడ్నాపర్లు వన్ వేలో వాహనం నడిపారు. సెక్టార్ 96 సమీపంలోని గోశాల వైపు వెలుతున్న సమయంలో కారు టైర్ పంచర్ అయ్యింది. వేరు కారులో సచిన్ పాఠక్ ను తరలించడానికి కిడ్నాపర్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

Delhi man Sachin Phatak escapes from kidnap because of heavy traffic

అక్కడికి వచ్చిన వేరే కారులో ఎక్కడానికి కిడ్నాపర్లు ప్రయత్నిస్తున్న సమయంలో సచిన్ పాఠక్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు. సమీపంలోని పోలీస్ స్టేషన్ చేరుకున్న సచిన్ పాఠక్ జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు.

సచిన్ పాఠక్ ను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు, వారికి పరోక్షంగా సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద హెవీ ట్రాఫిక్ కారణంగా కిడ్నాప్ కు గురైన సచిన్ పాఠక్ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+