అమ్మ ట్రాఫిక్ పోలీసు..!! హర్లే డెవిడ్‌సన్ బైక్ మ్యూజిక్‌పై కూడా ఫైన్.. గన్నీ బ్యాగుల పేరుతో...
ఢిల్లీ : కొత్త మోటారు వాహన చట్టం అస్త్రాన్ని పోలీసులు ఎడా పెడా వాడుతున్నారు. చిత్ర, విచిత్ర కారణాలు చెపుతూ చలాన్ వేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. అందుకు గల కారణం ఏం చెప్పారో తెలుసా .. బండి మీద మ్యూజిక్ పెట్టుకున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి అదీ ఇన్‌బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయినా .. చేయించారని చలానా వేసి ముక్కుపిండి వసూల్ చేశారు. పోలీసుల చర్యను తప్పుపడుతూ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు సదరు యువకుడు.
ఇటీవల ఢిల్లీ తిలక్ నగర్ వద్ద నుంచి రాఘవ్ అనే యువకుడు తన కొత్త హర్లే డెవిడ్‌సన్ బైక్‌తో వస్తున్నాడు. ఆ టూవీలర్‌ను ఇటీవలే కొనుగోలు చేశాడు రాఘవ్. దానికి మ్యూజిక్ సిస్టమ్, పక్కల జీన్స్ బ్యాగులు కూడా ఉన్నాయి. రాఘవ్‌ను ఆపిన పోలీసులు .. స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే చెప్పారు. తర్వాత మ్యూజిక్ సిస్టం ఉందని చెప్పారు. అదీ తన బైక్‌తో వచ్చిందని చెబితే వినిపించుకోరు. అప్పటికే తాను 30 శాతం సౌండ్ పెట్టుకొని వస్తుండగా .. 100 శాతం సౌండ్ పెట్టి వీడియో తీశారు. టూ వీలర్‌కు గన్నీ బ్యాగులు ఉన్నాయని మెలిక పెట్టారు. అవీ వాహనంతో వచ్చాయని చెప్పినా వినిపించుకోలేదు. వీడియో తీసి .. తమ జులుం ప్రదర్శించారు.

తన వాదనను ఏసీపీ, ఎస్సై వినిపించుకోలేదని రాఘవ్ వాపోయారు. ఎంత చెప్పిన వినిపించుకోకుండా .. ఫైన్ చేశారు. వారు చెప్పిన కారణం ఏంటో తెలుసా ... మీరు వాహనంపై మ్యూజిక్ వినడమేనని చెప్పడంతో ... తనకు జరిగిన ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే 200 సార్లు షేర్ చేయగా .. 350 లైకులు వచ్చాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications