Delhi : దారి ఇవ్వలేదని డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు..
ప్రస్తుత సమాజంలో చిన్నచిన్న విషయాలకే కోపడ్డం, కొట్టుకోవడం చంపుకోవడం పరిపాటిగా మారింది. చిన్న విషయాలకే కోపోద్రిక్తులై ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఇప్పడు ఢిల్లీలో చోటుచేసుకుంది. బైక్‌కు దారి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ను అతి కిరాతంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజాధానిలో చోటుచేసుకుంది.
ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతానికి చెందినవాడు మనోజ్ కుమార్. ఇతను పొట్టకూటికోసం గురుగ్రామ్‌కు వచ్చాడు. అక్కడ ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఎప్పటిలాగే విధుల్లో భాగంగా గురువారం సాయంత్రం మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను తన క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు మనోజ్. అయితే, మరో వ్యక్తి కోసం మెహ్రోలీ ప్రాంతానికి బయలుదేరాడు. అప్పడు రాత్రి 8.40 గంటలు అయ్యింది. ఆ సమయంలో నగరమంతా పూర్తి ట్రాఫిక్‌తో నిండి ఉంది. ఆ ట్రాఫిక్‌లో మనోజ్ కారు కూడా చిక్కుకుని ఉంది. అయితే, అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న మరో ముగ్గురు వ్యక్తులు మనోజ్‌ను ఓవర్ టేక్ కోసం దారి ఇవ్వమని అడిగారు. అయితే ఆ ట్రాఫిక్‌లో బైక్ వెళ్లేంత గ్యాప్ లేకపోవడంతో మనోజ్ దారి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు మనోజ్‌తో గొడవపడ్డారు.

ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే చనిపోయాడు..
అయితే, ఈ గొడవ కాస్త పెద్దదిగా మారింది. దాంతో ఆ ముగ్గురి వ్యక్తుల్లో ఉన్న ఓ వ్యక్తి కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. అయితే, కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్ మనోజ్‌ను అక్కడ ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే మనోజ్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మైనర్ అయిన ఒక నిందితుడ్ని గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications