మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టాక సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటనలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే మెట్రో ట్రైన్ లోనూ మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దిల్లీలోని మెట్రోలో జరిగింది. దిల్లీలోని బధ్ కాల్ మోర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. మెట్రోలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా ఇద్దరు మహిళలు ఒకర్నొకరు జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారు. మరి ఈ వివాదానికి గల కారణం ఏంటి..?
Kalesh between two ladies inside kaleshi Delhi Metro over seat issues pic.twitter.com/tny8m7TSIx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025
నిత్యం రద్దీగా ఉండే దిల్లీ మెట్రో ట్రైన్ లో ఊహించని ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు వింతవింతగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ తో పోలుస్తున్నారు. ఇది దిల్లీ మెట్రోలో జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
దిల్లీలోని బధ్ కాల్ మోర్ స్టేషన్ పరిధిలో రైలు ఎక్కిన ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు కొట్టుకునే సమయంలో సీటు ఖాళీగానే ఉండటం గమనార్హం. మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరూ జుట్టు, జుట్టు పట్టుకుని ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒక మహిళ సీటుపై పడిపోగా.. మరో మహిళ పైనుంచి కొట్టసాగింది.

అలా ఒకరి జుట్టును మరొకరు పట్టుకుని లాగుతూనే ఉన్నారు. అక్కడే ఉన్న మరో మహిళ వారిని ఆపేందుకు ప్రయత్నించింది. అయినా ఆమె ప్రయత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications