హామీ ఇచ్చి సహజీవనం పేరుతో రేప్, ఇంజనీర్ అరెస్ట్

తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు మంగళవారం తూర్పు ఢిల్లీకి చెందిన శంకర్ పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతను పెళ్లికి నిరాకరించడంతో యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బుధవారం అతనిని అరెస్టు చేశారు.
ఫిర్యాదు చేసిన యువతి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోందని పోలీసులు తెలిపారు. ఆ యువతికి జితేందర్ కుమార్‌తో కొద్ది నెలల క్రితం పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఈస్ట్ డిల్లీలోని తన ఫ్లాట్‌లో కొన్ని రోజులు ఉంచాడు. వారిద్దరు సహజీవనం చేశారు. ఈ సమయంలో పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications