హ్యాపీ: 18 ఇంటర్నేషనల్ మెట్రోల్లో ఢిల్లీకి 2వ స్థానం
న్యూఢిల్లీ: 18 అంతర్జాతీయ మెట్రో వ్యవస్థల్లో మన దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైలుకు చోటు లభించింది. వినియోగదారుల సంతృప్తిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఆన్‌లైన్ కస్టమర్స్ సర్వేలో ఢిల్లీ మెట్రోకు రెండవ స్థానం లభించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ (డీఎంఆర్సీ) ప్రకారం.. లండన్ డీఎల్ఆర్, బ్యాంకాక్ వ్యవస్థలు ప్రయాణికులకు ఉత్తమ సేవలను అందిస్తున్నట్టు నెట్ ప్రమోటర్స్ స్కోర్ (ఎన్పీఎస్)లో తేలినట్లు తెలిపారు.
ఈ సర్వేను గ్లోబల్ మెట్రో బెంచ్ మార్కింగ్ గ్రూప్స్ 'నోవా', 'కోమెట్' (కమ్యూనిటీ ఆఫ్ మెట్రోస్) గ్రూపులు నిర్వహించాయని చెప్పారు. ఈ సర్వేలో వినియోగదారులు ఇంకా కొన్ని సర్వీసులు అందించాలని సూచనలు చేశారు.

ఈ సర్వేలో 41,000 మంది వినియోగదారుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు సర్వేను ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఈ సర్వేలో హాంగ్ కాంగ్ ఎంటీఆర్, ఢిల్లీ మెట్రో, లండన్ అండర్ గ్రౌండ్, మెట్రో డి మాడ్రిట్, పారిస్ రాట్ప్, మెట్రో డి శాండిగో, సింగపూర్ ఎస్ఎంఆర్టీ, బార్సీలోనా టీఎంబీ, బ్రసెల్స్ ఎస్టీఐబీ, బ్యాంకాక్ బీఎంసీఎల్, లండన్ డీఎల్ఆర్, ఇస్తాంబుల్ ఉల్సిమ్, కౌలాలంపూర్ రాపిడ్ పీఎల్, మెట్రోపాలిటనో డి లిస్బోవా, మోంట్రీల్ ఎస్టీఎమ్, న్యూ క్యాస్టిల్ నెక్సస్, మెట్రో రియో, టోరంటో టీటీసీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications