ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు: వందేళ్ల కాలంలో రెండో అత్యంత తక్కువ: చలితో గజగజ..!
దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత లు రికార్డు స్థాయిలో పడిపోయింది. గడిచిన వందేళ్ల కాలంలో ఈ డిసెంబర్ మాసంలోనే రెండు సార్లు అత్యంత తక్కవ ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఈ ఏడాది శీతాకాలంలో అత్యంత చలి రోజుగా శనివారం రికార్డుకెక్కింది. 2013 డిసెంబర్ 30న ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే 1996 డిసెంబర్ 11న 2.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు దాదాపు 13 ఏండ్ల తర్వాత ఆ స్థాయిలో చలి పెరుగుతోంది.
ఈ డిసెంబర్ మాసంలో 26వ లేదీన ఢిల్లీలో సగటు అధిక ఉష్ణోగ్రత 19.85 డిగ్రీలు కాగా.. అంచనా ఉష్ణోగ్రత 19.15 డిగ్రీలులను గా ఉంది. దాదాపు వందేళ్ల తరువాత అంటే 1997 తరువాతి కాలంలో నమోదైన ఉష్ణోగ్రత లను పరిశీలిస్తే ఈ నెలలొనే 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయింది. గతంలో 1919, 1929, 1961, 1997 సంవత్సరాల కాలంలోనే మొత్తంగా వందేళ్ల సమయంలో అధిక ఉష్ణోగ్రత లు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఈ డిసెంబర్ లో 26 వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రత 19.85 డిగ్రీలు నమోదు కాగా.. అంచనా ప్రకారం 19.15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. అదే స్థాయిలో నమోదైతే గత వందేళ్ల కాలంలో 1997 తరువాత మరో సారి ఢిల్లీలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబున్నారు. 1997 లో అత్యంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత 17.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ డిసెంబర్ 18న లో ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలుగా నమోదు కాగా..అదే విధంగా ఈ నెల 25న పాలెం సమీపంలో 11.4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.
1997 లో రికార్డు స్థాయిలో చలిగాలుల తీవ్రత నమోదైంది. తిరిగి ఇప్పుడు డిసెంబర్ 14 నుండి దాదాపు అదే స్థాయిలో చలి గాలులు వీస్తున్నాయి. అయితే, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ..వైద్య శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications