ఫైవ్ స్టార్ హోటల్లో మోడల్‌పై అత్యాచారం... ముంబై వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు...
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితుడు బాధితురాలికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. సరదాగా కలిసి కాసేపు ముచ్చటించుకుందామని చెప్పిన అతను... ఆపై ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తోంది. కొన్నాళ్ల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల కుటుంబంతో కలిసి ఢిల్లీ వచ్చిన అతను ఆమెను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ఓ మిత్రుడి ఇంటికి రావాలని కోరాడు. అందుకు ఆ మోడల్ నిరాకరించింది. దీంతో ఖాన్ మార్కెట్ వద్దకు వస్తే కలుద్దామని మళ్లీ కబురు పెట్టాడు. దీంతో ఆ మోడల్ అక్కడికి వెళ్లి అతన్ని కలిసింది. ఇద్దరూ కలిసి అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేశారు.

అనంతరం చాణక్యపురిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి అతను ఆమెను తీసుకెళ్లాడు. అప్పటికే అందులో గదిని బుక్ చేసిన అతను... అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆ మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 23న ప్రత్యేక పోలీస్ బృందాన్ని ముంబైకి పంపించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.
గతంలో ముంబైలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 55ఏళ్ల ఓ వైద్యుడు 22 ఏళ్ల మోడల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వద్దకు ట్రీట్‌మెంట్‌కు వెళ్లిన మోడల్‌తో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో ఓరోజు తన క్లినిక్‌కి వచ్చిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో మోడల్ ఆరోపణలపై అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సదరు డాక్టర్ నుంచి ఆమె బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించామన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications