"మరొకతనితో ఆమె సన్నిహితంగా, అందుకే చంపేశా"

న్యూఢిల్లీ: గత నాలుగేళ్లుగా తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండవేని, ఏడాది నుంచి అవి చెడిపోయాయని ఢిల్లీలో నడిరోడ్డుపై మహిళా టీచర్‌ను హత్య చేసిన సురేందర్ సింగ్ పోలీసులకు చెప్పాడు. తర్వాత కొంత కాలానికి సర్దుకుందని భావించానని, అయితే ఆమె ఫేస్‌బుక్ చూసి షాక్ తిన్నానని అతను చెప్పాడు.

ఆమె ఫేస్‌బుక్ ఖాతా పాస్‌వర్డ్ తనకు తెలుసునని, దాన్ని తెరిచి చూస్తే అందులో మోహిత్ అనే యువకుడితో ఆమె అభ్యంతరకరంగా ఉన్న తన ఫొటోలు పంపినట్లు తెలిసిందని, అతడితో చాలా సన్నిహితంగా చాటింగ్ చేసినట్లు కూడా తెలిసిందని అతను చెప్పాడు.

Woman stabbed

కత్తి వాడడం రాదంటూ లేడీ టీచర్ కరుణ తనను హేళన చేసిందని, దాంతో తనకు కత్తి వాడడం ఎంత బాగా తెలుసో చూపించాలనే ఆమెను తాను అన్నిసార్లు పొడిచానని సురేందర్ సింగ్ చెప్పాడు. తాను ముందుగా కరుణ బ్యాగ్ మీద కత్తి ఆడించానని, తనను వెక్కిరించడంతో తనకు కత్తి వాడడం ఎంత బాగా తెలుసో చూపించడానికి పదే పదే పొడిచానని అతను చెప్పాడు.

అతనే ఫోన్ చేసి చెప్పాడు

కరుణను హత్య చేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే. నాలుగేళ్ల పాటు తనతో సన్నిహితంగా ఉన్న ఆమె వేరే యువకుడికి అభ్యంతకర ఫొటోలు పంపడం చూసి తాను మనస్తాపానికి గురయ్యానని చెప్పాడు. దాని గురించి తాను అడిగితే గూఢచర్యం చేస్తున్నావా అంటూ తిట్టిపోసిందని చెప్పాడు.

తాను కరుణ కలిసి ఉన్నప్పటి కొన్ని ఫొటోలను అతను పోలీసులకు చూపించాడు.ఇద్దరి ఫేస్‌బుక్ ఖాతాల్లో కూడా ఆ ఫొటోలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆదిత్య పేరుతో సురేందర్ సింగ్ ఫొటోలు ఉన్నాయి. 2012 నుంచి తమ ఇద్దరి మధ్య సంబంధాలున్నాయని చెప్పాడు. అయితే ఇటీవల మోహిత్ తనకు బాగా తెలుసునని చెబుతూ ఆమె పంపించిన ఫొటోలను కూడా తనకు చూపించాడని, అవి చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయానని చెప్పాడు.

తర్వాత ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకుే జిటీబీ మెట్రోస్టేషన్‌ వద్దకు పిలిచానని చెప్పాడు. వారిద్దరి మొబైల్ ఫోన్స్ లొకేషన్ పరిశీలిస్తే ఇద్దరు కూడా హత్యకు ముందు గంట నుంచి అక్కడే ఉన్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+