నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే నూనె పోసి.. కారం చల్లి..
పెళ్లంటే నూరేళ్ల పంట, పతియే ప్రత్యక్ష దైవం అని పెద్దలు అంటారు. కానీ ప్రస్తుత కాలంలో యువత ఇలాంటివి పట్టించుకోవడం లేదు. ఇటీవల భార్యాభర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. భర్తలను లేపేస్తున్న భార్యలు.. లేదా భార్యలను హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధానిలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నూనె పోసింది. అలాగే కారం పొడితో భార్యపై దాడికి పాల్పడింది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. మదాన్ గిర్ ప్రాంతంలో ఉండే దినేష్ ఫార్మాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తాజాగా నిద్రిస్తున్న దినేష్ పై దారుణానికి ఒడిగట్టింది ఆ భార్య. నిద్రలో ఉన్న అతడిపై వేడి వేడి నూసె పోసింది. ఆ తర్వాత కారం పొడి చల్లింది. దీంతో అతడు కేకలు వేస్తూ భయబ్రాంతులకు లోనయ్యాడు. ప్రస్తుతం సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో ఐసీయూలో క్రిటికల్ కండీషన్ లో ఉన్నాడు. ఇదే ఘటనపై దినేష్ ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దినేష్ పై అర్ధరాత్రి 3 గంటల సమయంలో నిద్రలో ఉన్నప్పుడు అతడి భార్య దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో ఆ జంట 8 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
దినేష్ నుంచి పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 2 న దినేష్ పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. డిన్నర్ చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి 3 గంటల 15 నిమిషాలకు దినేష్ కు తన ఒంటిపై ఏదో పడిపోయినట్లు మంటలు, నొప్పి గాయాలతో కేకలు పెట్టాడు. దినేష్ ఒంటిపై సలసల కాగే నూనె పోసింది భార్య. ఆ తర్వాత ఆ గాయాలపై కారం పొడి చల్లింది. అరిస్తే ఇంకాస్తా కారం చల్లుతానని బెదిరించినట్లు దినేష్ తెలిపాడు.

దినేష్ కేకలకు ఇంటి కింద ఉన్న కుటుంబ సభ్యులు పైకి వచ్చి డోర్ కొట్టారు. డోర్ లోపలినుంచి క్లోజ్ చేసి ఉంది. అయితే మొత్తానికి భార్య డోర్ ఓపెన్ చేయడంతో దినేష్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు దిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. దినేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ లపై నిందితురాలి మీద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications