డిన్నర్ కు పిలిచి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి యువతిని రేప్ చేసిన టెక్కీ, మూడు నెలలకు!

బెంగళూరు: పరిచయం ఉన్న యువతిని ఇంటికి ఆహ్వానించి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపిన టెక్కీ ఆమె మీద అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరులోని బెళ్లందూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన మైకెల్ సూరంగ్ బెంగళూరు చేరుకుని బెళ్లందూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. జార్ఖండ్ లోని రాంచీకి చెందిన యువతి బెంగళూరు చేరుకుని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

Delhi origin techie arrested for rape charges in Bangalore

రాంచీకి చెందిన యువతితో మైకెల్ కు పరిచయం పెరిగింది. కొంతకాలం క్రితం రాంచీ యువతిని మైకెల్ డిన్నర్ కు ఇంటికి ఆహ్వానించాడు. తరువాత జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపిన మైకెల్ తనకు ఇచ్చి నేను నిద్రలోకి జారుకున్న తరువాత అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని వైద్య పరీక్షలకు తరలించారు. యువతి మీద మైకెల్ అత్యాచారం చేశాడని విచారణలో వెలుగు చూడటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. యువతి మీద తాను అత్యాచారం చెయ్యలేదని, ఆమె తన మీద ఇష్టంతోనే డిన్నర్ కు ఇంటికి వచ్చిందని మైకెల్ ఆరోపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+