ఢిల్లీ పోలీస్ హెడ్ క్వాటర్స్: పట్టపగలు 10వ అంతస్తు నుంచి దూకి ఏసీపీ ఆత్మహత్య, డెత్ నోట్ !

న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన పోలీసు అధికారి 10వ అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్యహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని పోలీసు హెడ్ క్వాటర్స్ (కేంద్ర కార్యాలయం)లోని 10వ అంతస్తు నుంచి గురువారం ఏసీపీ ప్రేమ్ బల్లబ్ (50) ఆత్మహత్య చేసుకున్నారు.

ఢిల్లీ క్రైం బ్రాంచ్, ట్రాఫిక్ విభాగాల్లో (రెండు విభాగాలు) ప్రేమ్ బల్లబ్ ఏసీపీ స్థాయి అధికారిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని పోలీసు హెడ్ క్వాటర్స్ కార్యాలయంలోని 10వ అంతస్తులో ప్రేమ్ బల్లబ్ కార్యాలయం ఉంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రేమ్ బల్లాబ్ కార్యాలయంలోకి వెళ్లారు.

Delhi police ACP Prem Ballabh commits suside by jumping off 10th floor

అనంతరం కార్యాలయంలోని సిబ్బందిని టీ తీసుకురావాలని ఏసీపీ ప్రేమ్ బల్లబ్ చెప్పారు. సిబ్బంది బయటకు వెళ్లిన వెంటనే ప్రేమ్ బల్లబ్ 10వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్రగాయాలైన ఏసీపీ ప్రేమ్ బల్లబ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడానికి ప్రయత్నించిన సమయంలోనే ఆయన మరణించారు.

పోలీసు హెడ్ క్వాటర్స్ లోనే ఏసీపీ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో సాటి పోలీసులు హడలిపోయారు. ప్రేమ్ బల్లబ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి డెత్ నోట్ రాసిపెట్టలేదని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఒత్తిడితోనే ప్రేమ్ బల్లాబ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+