ఢిల్లీ దాడులకు ప్లాన్: ఆల్ ఖైదా ఉగ్రవాది అరెస్టు!
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా దాడులు చెయ్యడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని వెలుగు చూడటంతో ఢిల్లీ నగర పోలీసులు పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బుధవారం ఉదయం ఆల్ ఖైదా ఉగ్రవాది అనే అనుమానంతో ఆసీఫ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఇతను ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ అనే ప్రాంతానికి చెందిన వాడని అధికారులు వెల్లడించారు.
క్రిస్ మస్, నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఆల్ ఖైదా ఉగ్రవాదులు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ వర్గాలు నవంబర్ చివరి వారంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని ఇద్దరిని ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆసీప్ ఇచ్చిన సమాచారంతో మరో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్న ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో మకాం వేసి దాడులు చెయ్యడానికి కుట్రపన్నుతున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. గత నెల నుంచి పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications