కిరాతకం:పదేళ్ళుగా మైనర్ బాలికల కిడ్నాప్, చివరికిలా
పదేళ్ళుగా మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న నరేష్ అనే నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ:మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారాలకు పాల్పడే 40 ఏళ్ళ నరేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ళుగా మైనర్ బాలికలపై నరేష్ అత్యాచారాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది.
న్యూఢిల్లీలోని విజయ్ విహర్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నరేష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే పదేళ్ళుగా నరేష్ చేసిన అకృత్యాలు వెలుగుచూశాయి.
పదేళ్ళుగా నరేష్ మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని తేలింది.పాఠశాలల నుండి ఇంటికి వెళ్తున్న బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం నిందితుడికి అలవాటుగా మారిందని పోలీసులు చెప్పారు.

మూడేళ్ళ నుండి పదేళ్ళ లోపు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం నిందితుడు అలవాటు చేసుకొన్నాడు. ఇప్పటికే నరేష్ పై మూడు కేసులు విచారణలో ఉన్నాయి.అయితే బెయిల్ పై విడుదలైన నరేష్ మళ్ళీ అవే పనులు చేస్తున్నాడు.
నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.. పదేళ్ళుగా మైనర్ బాలికలనే లక్ష్యంగా చేసుకొని నరేష్ అత్యాచారాలకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications