వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐకి రహస్య సమాచారం: ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ)కి రహస్య సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భారత వైమానిక దళానికి చెందిన అధికారిని అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌‌కు అత్యంత రహస్యమైన సమాచారాన్ని, పత్రాలను చేరవేస్తున్నాడనే ఆరోపణపై గ్రూప్ కెప్టెన్ అరుణ్ మార్వా‌హ్‌ను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు.

అధికారిక రహస్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆరోపణలు రుజువైతే అధికారికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. పాకిస్తాన్ ఏజెంట్‌కు 51 ఏళ్ల ఐఎఎఫ్ అధికారి ముఖ్యమైన సమాచారన్ని అందజేశాడని తెలుస్తోంది.

Delhi Police arrests Air Force official for allegedly spying for Pakistan's ISI

పాకిస్తాన్ ఏజెంట్ వాట్సప్ మహిళగా నటిస్తూ ఆ సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం ఐఎస్ఐ ఏజెంట్ మార్వాహ్‌తో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. వాట్సప్‌లో క్రమం తప్పకుండా చాటింగ్ చేస్తూ వచ్చాడు.

ఎయిర్ ఫోర్స్ కేంద్ర కార్యాలయంలోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
The Special Cell of Delhi Police arrested an Indian Air Force official for allegedly spying for Pakistan's Inter-Services Intelligence (ISI) on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X